chada venkatreddy: 48 వేల ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడ్డారు: చాడ వెంకట్ రెడ్డి

  • ఈ రోజు కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు సమర్పిస్తున్నాం
  • కూనంనేనిని అక్రమంగా అరెస్టు చేశారు
  • కార్మికులపై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి, నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా దీక్షను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయనను  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  పరామర్శించారు.

ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...  48 వేల ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. ఈ రోజు కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. శాంతియుతంగా దీక్ష చేస్తోన్న కూనంనేనిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కాగా, కూనంనేని దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీపీఐ, అనుబంధ సంఘాలు దీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నాంపల్లి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో పలువురు వామపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు పాల్గొన్నారు.

More Telugu News