Naga Shourya: 'అశ్వద్ధామ' వచ్చేది అప్పుడే

  • సొంత బ్యానర్లో నాగశౌర్య సినిమా 
  •  దర్శకుడిగా రమణ తేజ పరిచయం 
  • ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు

ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. ఒక వైపున బయట బ్యానర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, సొంత బ్యానర్లోను సినిమాలు చేస్తున్నాడు. అలా ఆయన సొంత బ్యానర్లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'అశ్వద్ధామ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'దీపావళి' పండుగ సందర్భంగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

ఊయలలో వున్న పసికందు వేలును పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News