colambia: కొలంబియాలో కూలిన మిలటరీ హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం

  • టేకాఫ్ అయిన కాసేపటికే అదృశ్యం
  • గతంలో ఇదే హెలికాప్టర్‌లో ప్రయాణించిన కొలంబియా అద్యక్షుడు, పోప్ ఫ్రాన్సిస్
  • దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
కొలంబియాలో హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పాలన్ క్యూరో వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన బెల్ 412 హెలికాప్టర్ కాసేపటికే అదృశ్యమైంది. ఆ తర్వాత అది అల్బాన్ ప్రాంతంలో కూలినట్టు గుర్తించారు. హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు వైమానికదళ పైలెట్లు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో గతంలో దేశాధ్యక్షుడు పలుమార్లు ప్రయాణించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు, లాటిన్ అమెరికా పర్యటన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇదే హెలికాప్టర్‌లో ప్రయాణించడం గమనార్హం. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
colambia
helicopter
accident

More Telugu News