Hema: ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ కావాలో ముందే ప్లాన్ చేసుకున్నారు: బిగ్ బాస్ షోపై హేమ వ్యాఖ్యలు

  • తనను బయటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపణ
  • తనతో కావాలని గొడవకు దిగేవాళ్లని వెల్లడి
  • శ్రీముఖి గేమ్ కు అందరూ బలవుతున్నారన్న హేమ
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ మరో వారంలో ముగియనుంది. ఈ షోలో తొలివారమే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని, శ్రీముఖి బర్త్ డే సందర్భంగా అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని వివరించారు. తాను బలమైన కంటెస్టెంట్ గా మారతానని తెలుసుకుని, తనను బయటికి పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలో అప్పుడే నిర్ణయించుకున్నారని వెల్లడించారు. తనతో హౌస్ లో కావాలనే గొడవకు దిగేవాళ్లని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీముఖి గేమ్ కు ఇతర కంటెస్టెంట్లు బలవుతున్నారని, శ్రీముఖి బయట ఒకలా, లోపల మరోలా మాట్లాడుతుందని ఆరోపించారు.  హిమజ ఎలిమినేట్ అయ్యాక తాను బిగ్ బాస్ షో చూడడమే మానేశానని తెలిపారు.
Hema
Bigg Boss
Tollywood

More Telugu News