Apple-1: దశాబ్దాల నాటి ఆపిల్ కంప్యూటర్ కు కళ్లు చెదిరే ధర

  • రూ.12.3 కోట్లకు అమ్మకానికి పెట్టిన వ్యక్తి
  • ఈబేలో ప్రకటన
  • 70వ దశకంలో ఆపిల్ తయారీ

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచంలో ఎంతటి గిరాకీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపిల్ కంప్యూటర్లు, ఆపిల్ ఐఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో ప్రపంచాన్ని ఏలుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆపిల్ బ్రాండ్ నేమ్ కారణంగా పాత ఉత్పత్తులకు సైతం కళ్లు చెదిరే ధర పలుకుతోంది. ఆపిల్ సంస్థ తొలినాళ్లలో తయారుచేసిన ఓ కంప్యూటర్ ను ఈబేలో అమ్మకానికి పెట్టారు. రికార్డు స్థాయిలో రూ.12.3 కోట్ల ధర నిర్ణయించారు. ఈ కంప్యూటర్ ను ఆపిల్-1గా పరిగణిస్తారు. 1978 నుంచి ఇది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నట్టు దీన్ని అమ్మకానికి ఉంచిన వ్యక్తి తెలిపారు. ఆపిల్ తయారు చేసిన ఎంతో అరుదైన కంప్యూటర్లు ప్రస్తుతం ఆరు ఉన్నట్టు గుర్తించగా వాటిలో ఇదొకటి.

More Telugu News