Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లో విజయ్ దేవరకొండ హంగామా

  • లేటెస్ట్ ఎపిసోడ్ లో విజయ్ సందడి
  • దీపావళికి స్పెషల్ గెస్ట్ గా రాక
  • నాగ్ తో వినోదం
టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ 3 లేటెస్ట్ ఎపిసోడ్ కు అతిథిగా వచ్చాడు. బిగ్ బాస్-3 దీపావళి ఎపిసోడ్ ప్రోమోలో విజయ్ దేవరకొండ కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, విజయ్ బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి కంటెస్టెంట్లతో హంగామా చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు తనదైన శైలిలో కొంటెగా సమాధానమిచ్చాడు.

"నీ పెళ్లి గురించి ప్రతి ఆర్నెల్లకోసారి ఏదో ఒక రూమర్ వస్తోంది విజయ్" అని నాగ్ అడగ్గా, "నా అమల ఎక్కడుందో వెతుక్కుంటున్నా" అంటూ విజయ్ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. దాంతో నాగ్ స్పందిస్తూ, "నీ అమల నీకు త్వరగా దొరకాలని ఆశీర్వదిస్తున్నా"నంటూ కామెంట్ చేశారు. మొత్తమ్మీద బిగ్ బాస్ సీజన్ 3 చివరిదశలో విజయ్ రాక ఇంటి సభ్యుల్లోనే కాకుండా ప్రేక్షకులను కూడా ఉత్సాహానికి గురిచేస్తుందనడంలో సందేహం లేదు.

Bigg Boss
Nagarjuna
Vijay Devarakonda

More Telugu News