BJP: దీపావళి నాడు విషాదం... వాకింగ్ కు వెళ్లిన బీజేపీ సీనియర్ నేత కమల్ శర్మ గుండెపోటుతో మృతి!

  • ప్రజలకు శుభాకాంక్షలు చెప్పి మార్నింగ్ వాక్ కు
  • గుండెపోటుతో మరణించిన కమల్ శర్మ
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీజేపీ నేతలు
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన రెండు గంటల తరువాత వాకింగ్ కు వెళ్లిన పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత కమల్ శర్మ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. ఈ ఉదయం ఫెరోజ్ పూర్ జిల్లాలో రోజు మాదిరిగానే వాకింగ్ కు వెళ్లిన కమల్ శర్మ, హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. అతని తోపాటు ఉన్న స్నేహితుడు, వెంటనే వాకర్స్ సాయంతో అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకు వచ్చేలోపే శర్మ మరణించారని వైద్యులు తెలిపారు. కమల్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతిపట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర బీజేపీ శాఖ సంతాపాన్ని వ్యక్తం చేసింది.
BJP
Kamal Sharma
Punjab
Morning Walk
Passes Away

More Telugu News