Biggboss: బిగ్ బాస్ -3 లీక్... నేడు బయటకు వెళ్లనున్న శివజ్యోతి!

  • చివరి దశకు వచ్చేసిన సీజన్ 3
  • ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న రాహుల్
  • రేసులో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా
టాలీవుడ్ లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు వచ్చేసింది. నేటితో 14వ వారం పూర్తి కానుండగా, ఎలిమినేషన్ లో రాహుల్ మినహా ఇంట్లోని మిగతా వారంతా ఉన్నారు. వీరిలో ఒకరు బయటకు వెళ్లడం ఖాయం. ప్రతి వారమూ ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయమై లీకులు వస్తున్నట్టుగానే, ఈ వారం కూడా ఎవరు వెళ్లిపోతారన్న విషయమై లీక్స్ వచ్చేశాయి. నేడు శివజ్యోతి బయటకు వెళ్లనున్నట్టు సోషల్ మీడియా చెబుతోంది. ఈ ఎలిమినేషన్ పూర్తయితే, బిగ్ బాస్ చివరి వారానికి వెళుతుంది. రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఇక శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజా కూడా రేసులో ఉన్నారు. వీరిలో టాప్-3లో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ ఉండవచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. నేడు శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందా? లేదా? అంటే రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకూ వేచి చూడాల్సిందే.
Biggboss
Sivajyothi
Eliminate
Baba Bhasker
Sri Mudhi
Varun
Ali Raja

More Telugu News