Kaleshwaram: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పంప్ హౌస్ నిర్మాణం పూర్తి... మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఘనత!

  • కాళేశ్వరంలో గాయత్రి పంప్ హౌస్ సిద్ధం
  • ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌస్ గా 'గాయత్రి'
  • 407 అడుగుల లోతున నిర్మాణం

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం పూర్తయింది. దీన్ని మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌస్ గా గాయత్రి పంప్ హౌస్ ఖ్యాతి పొందింది. పూర్తి స్థాయిలో 3 టీఎంసీల నీటిని పంప్ చేయగలిగేలా దీనిని నిర్మించారు. పంప్ హౌస్ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో 7వ మెషీన్ వెట్ రన్ దిగ్విజయంగా నిర్వహించారు.

ఈ 7వ మెషీన్ భూగర్భ పంపింగ్ స్టేషన్ నుంచి 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఒక గంటా 40 నిమిషాల పాటు పంప్ చేసింది. ప్రపంచంలోని ఇతర పంప్ హౌస్ ల కంటే దీని సామర్థ్యం ఎక్కువని తెలుస్తోంది. దీంట్లోని ఒక్కో మెషీన్ సామర్థ్యం 139 మెగావాట్లు. రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగలవు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా గాయత్రి పంప్ హౌస్ ను 407 అడుగల లోతున నిర్మించారు.

More Telugu News