KRKR: 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అప్ డేట్... రేపు దుమ్ముదుమారం రేపుతామంటున్న వర్మ

  • రేపు ట్రైలర్ రిలీజ్
  • ముహూర్తం ఫిక్స్ చేసిన వర్మ
  • నేతలకు దీపావళి శుభాకాంక్షలు!
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా ప్రాజెక్టు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఏపీ రాజకీయ స్థితిగతులపై వస్తున్న చిత్రంగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం ప్రాచుర్యం అందుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని వర్మ ఫేస్ బుక్ లో ప్రకటించారు. దుమ్ముదుమారం చేసేస్తాం కాచుకోండి అన్నట్టుగా వర్మ పోస్టు చేశారు. అంతేకాకుండా పలువురు నేతల పేర్లలోని మొదటి అక్షరాలను పోస్టు చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
KRKR
RGV
Andhra Pradesh
Telangana
Tollywood

More Telugu News