Haryana: హర్యానా డిప్యూటీ సీఎం పదవిపై వీడిన అనిశ్చితి... ప్రమాణస్వీకారం చేయనున్న దుష్యంత్

  • హర్యానా డిప్యూటీ సీఎంగా దుష్యంత్ చౌతాలా
  • అనూహ్యంగా తెరపైకి వచ్చిన దుష్యంత్ తల్లి నైనా పేరు
  • అనిశ్చితికి తెరదించిన ఖట్టర్
హర్యానాలో జేజేపీతో జట్టుకట్టిన బీజేపీ సర్కారు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీకి సీఎం పదవి దక్కగా, జేజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేట్టు ఒప్పందం కుదిరింది. మొదట డిప్యూటీ సీఎం పదవిని జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా చేపడతారని కథనాలు వచ్చాయి. అయితే అనూహ్యరీతిలో దుష్యంత్ తల్లి నైనా చౌతాలా పేరు డిప్యూటీ సీఎం రేసులో బలంగా వినిపించింది. ఈ అనిశ్చితికి బీజేపీ శాసనసభాపక్ష నేత మనోహర్ లాల్ ఖట్టర్ తెరదించారు. డిప్యూటీ సీఎంగా దుష్యంతే ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.
Haryana
Dy CM
Dushyant Chautala

More Telugu News