Vijayasanthi: పునరాగమనంలోనూ ఇంతటి స్పందనా...!:  అభిమానుల ఆదరణకు ముగ్ధురాలైన విజయశాంతి

  • టాలీవుడ్ లో విజయశాంతి రీఎంట్రీ
  • సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలకపాత్ర
  • ఫేస్ బుక్ లో స్పందించిన విజయశాంతి
సీనియర్ నటి విజయశాంతి తెలుగు చిత్రసీమలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. గతంలో హీరోయిన్ కు హీరో ఇమేజ్ కల్పించిన నటిగా విజయశాంతి ఎంతో పేరుతెచ్చుకున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి సినీ రంగానికి కొద్దికాలం దూరమైనా, మళ్లీ మహేశ్ బాబు చిత్రంతో పునరాగమనం చేస్తున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. తన రీఎంట్రీ పట్ల వస్తున్న స్పందన విజయశాంతిని ఆనందానికి గురిచేస్తోంది.

ఓ నటిగా అందరి అభిమానం పొందడం నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, అయితే పునరామగనంలో అంతకంటే ఎక్కువగా అభిమానుల ఆదరణ లభించడం సంతోషానికి గురిచేస్తోందని ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. ప్రిన్స్ మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తాను నటించడం మర్చిపోలేని అనుభవంగా భావిస్తానని తెలిపారు.
Vijayasanthi
Tollywood
Mahesh Babu

More Telugu News