Sarileru Neekevvaru Movie: మహేశ్ బాబు చిత్రంలో విజయశాంతి ఫస్ట్ లుక్ అదుర్స్

  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు'
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న మహేశ్ సినిమా
  • 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి
మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు చెందిన ఒక్కొక్క అప్డేట్ ను చిత్ర యూనిట్ వరుసగా విడుదల చేస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు లుక్ ను విడుదల చేసిన యూనిట్ సభ్యులు... దీపావళి సందర్భంగా ఈరోజు విజయశాంతి లుక్ ను విడుదల చేశారు.

 స్టైలిష్ లుక్ తో ఈ పోస్టర్ లో విజయశాంతి ఆకట్టుకుంటున్నారు. కూర్చీలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, ఏదో ఆలోచిస్తున్నట్టు ఆమె ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటిస్తుండటంతో... ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, ఈ చిత్రంలో విజయశాంతి పోషిస్తున్న పాత్ర ఏంటనేది ఇంత వరకు చిత్ర యూనిట్ సీక్రెట్ గానే ఉంచింది. సంక్రాంతి సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కాబోతోంది.
Sarileru Neekevvaru Movie
Mahesh Babu
Vijayashanthi
Tollywood
First Look

More Telugu News