Team India: టీమిండియాలో శాంసన్ ఎంపికపై గంభీర్ వ్యాఖ్యలు

  • బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు శాంసన్ ఎంపిక
  • సరైన సమయంలో శాంసన్ ఎంపిక జరిగిందన్న గంభీర్
  • అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన

ఇటీవలే దేశవాళీ క్రికెట్లో డబుల్ సెంచరీతో మోత మోగించిన కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు టీమిండియాలో స్థానం లభించడం పట్ల మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ హర్షం వ్యక్తం చేశాడు. సరైన సమయంలో శాంసన్ ఎంపిక జరిగిందని పేర్కొన్నాడు.

"బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు ఎంపికైన శాంసన్ కు శుభాకాంక్షలు. శాంసన్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. భారత క్రికెట్ కు నువ్వు చాలా క్రికెట్ బాకీ ఉన్నావు. సుదీర్ఘకాలం సేవలందించాలి" అని గంభీర్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఉత్సాహంగా కదిలే చేతులు, చురుకైన పాదాలు, తెలివైన బుర్ర శాంసన్ సొంతమంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News