Gujarath: గాంధీనగర్ అభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తా!: కేంద్రమంత్రి అమిత్ షా

  • వాజ్ పేయి, అద్వానీలు ఇక్కడి నుంచి ఎన్నికై బలమైన పునాదిని అందించారు
  • ఎంపీలందరూ తమ నియోజకవర్గాలపై దృష్టిపెడితే దేశం దానంతటదే పురోగమిస్తుంది
  • కాంగ్రెస్ పేదరికంపై చేసిందేమీ లేదు
గాంధీనగర్ నియోజకవర్గ అభివృద్ధికే తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రస్తుతం అమిత్ షా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్ లో కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు.

‘ఈ నియోజకవర్గ అభిృద్ధికే నేను కట్టుబడి ఉన్నా. దీన్ని అత్యున్నత నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే నా కర్తవ్యం. ఎంపీలందరూ తమ నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరిస్తే, దేశం దానంతటదే అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు. కాంగ్రెస్ పేదరికంపై చేసిందేమీ లేదని షా విమర్శించారు. గొప్ప నేతలైన అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీలు గాంధీనగర్ నుంచి ఎంపీలుగా ఎన్నికై పునాదులను బలోపేతం చేశారని, ఫలితంగా ఇక్కడ ఎంపీగా తన బాధ్యతలు నిర్వర్తించడం తేలికైందన్నారు.
Gujarath
Gandhi nagar
central minister
Amith shah

More Telugu News