cm: పార్టీ మారడంపై పండగ తర్వాత స్పందిస్తా: టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

  • నా అనుచరులపై ఇన్ని దాడులెప్పుడూ జరగలేదు
  • 4 నెలలుగా గన్నవరంలో అభివృద్ధి లేదు
  • ఈ విషయాలన్నీ జగన్ దృష్టికి తెచ్చా
ఏపీ సీఎం జగన్ తో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో, వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో వంశీని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2006లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన అనుచరులపై ఇప్పుడు జరిగినన్ని దాడులు ఎప్పుడూ జరగలేదని, నాలుగు నెలలుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చానని అన్నారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక, పార్టీ మారే విషయమై ఆయన స్పందిస్తూ, దీపావళి పండగ తర్వాత చెబుతానని స్పష్టం చేశారు.
cm
Jagan
Telugudesam
MLA
Vallabhaneni

More Telugu News