ప్రతిభకు గుర్తింపు... బుమ్రా, స్మృతి మంధన విజ్డెన్ పురస్కారాలకు ఎంపిక
- విజ్డెన్ అవార్డుల ప్రకటన
- ఈ ఏడాది ఐదుగురికి అవార్డులు
- భారత్ నుంచి బుమ్రా, స్మృతి ఎంపిక
ఈ ఏడాది అవార్డులు అందుకోబోతున్న వారిలో పాకిస్థాన్ ఆటగాడు ఫకర్ జమాన్, శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నే, ఆఫ్ఘనిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ కూడా ఉన్నారు. ఇటీవల డబుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన భారత యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గురించి విజ్డెన్ ఇండియా మ్యాగజైన్ తాజా ఎడిషన్ లో ప్రముఖంగా పేర్కొన్నారు.