West Godavari District: ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడి ‘ఆకలి కేక’

  • పాలకొల్లు శాసన సభ్యుడి వినూత్న నిరసన
  • నర్సాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ
  • ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు
ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో లక్షలాది కార్మికులు రోడ్డున పడి ‘అన్నమో రామచంద్ర’ అని అలమటిస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడాన్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసనకు తెరతీశారు. తక్షణం ఇసుక కొరత తీర్చాలని, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ‘ఆకలి కేక’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.

తన నియోజక వర్గం కేంద్రమైన పాలకొల్లు నుంచి నర్సాపురంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, భవన నిర్మాణ కార్మికులు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇసుక పాలసీ అమలులో పూర్తిగా విఫలమైన వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
West Godavari District
palakollu
MLA ramanidu
sand policy

More Telugu News