Telangana: కేసీఆర్ వ్యాఖ్యలు కార్మికులను భయపెట్టేలా ఉన్నాయి: సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి

  • కార్మికులను చర్చలకు పిలవననడం సరికాదు  
  • కేసీఆర్ కు మానవత్వ ఆలోచనలు రాకపోవడం దుర్మార్గం
  • ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తాం

టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, యూనియన్ల మూలంగా కార్మికులు బలైపోతున్నారని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలు కార్మికులను భయపెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు.

కేసీఆర్ కు మానవత్వ ఆలోచనలు రాకపోవడం దుర్మార్గమని, కార్మికులను చర్చలకు పిలవను, మాట్లాడను అంటే సరికాదని హితవు పలికారు. హైకోర్టు ఆదేశించినట్టుగా ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణం అంటే ఎలా? ఆర్టీసీ చైర్మన్ ను నియమించేది ఎవరు? నిర్ణయాలు తీసుకునేది ఎవరు? అని ప్రశ్నించారు. ఆర్టీసీ విలీనం విషయంలో ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News