Apsrtc: ఏమవుతుందో ఏమో దేవుడికే ఎరుక!: ఏపీఎస్సార్టీసీ విలీనంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్య

  • ఏపీలో ఒక ఎక్స్ పర్మెంట్ చేశారు
  • అక్కడ ఏ మన్నూ కూడా జరగలేదు
  • ఆర్డర్ తీశారు.. కమిటీ వేశారు
టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగేది కాదని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్  ఏపీఎస్సార్టీసీ గురించి ప్రస్తావించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీఎస్సార్టీసీ విలీనం గురించి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘ఒక ఎక్స్ పర్మెంట్ చేశారు వాళ్లు. అక్కడ ఏం మన్నూ కూడా జరగలేదు. మీకు తెల్వదు. కమిటీ వేశారు. ఇంకా, మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో చెబుతారట కథ’ అని అన్నారు.

అయితే, ఇదే అంశమై మరో విలేకరి ప్రశ్నించగా కేసీఆర్ బదులిస్తూ, ‘నీకు అర్థమవడం లేదు సీఎం జగన్ సంగతే నేను చెబుతున్నా. మైకులోనే చెబుతున్నా..దాచుకోవడం ఎందుకు? ఏం చేసిండ్రు? ఆర్డర్ తీసిండ్రు, కమిటీ వేసిండ్రు.. ఏమవుతుందో ఏమో దేవుడికే ఎరుక! ఎస్.. ఐయామ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్’ అని చెప్పుకొచ్చారు.
Apsrtc
Tsrtcs
Telangana
cm
kcr
jagan

More Telugu News