Australia: క్రికెట్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి డ్రింక్స్ మోసుకొచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని

  • ఆస్ట్రేలియాలో శ్రీలంక జట్టు పర్యటన
  • ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో లంక ప్రాక్టీసు మ్యాచ్
  • హైలైట్ గా నిలిచిన ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ క్రికెట్ కు వీరాభిమాని. తాజాగా శ్రీలంక జట్టు ఆసీస్ పర్యటనకు రాగా, సన్నాహాక మ్యాచ్ గా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో పోటీ నిర్వహించారు. కాన్ బెర్రాలో జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు వికెట్ తేడాతో నెగ్గింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆటగాళ్ల కంటే ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ హైలైట్ అయ్యారు. శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తుండగా, ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆటగాళ్ల కోసం ఆయన డ్రింక్స్ మోసుకొచ్చారు. ఎంతో నిరాడంబరంగా డ్రింక్స్ కంటెయినర్ తీసుకువచ్చి ఆటగాళ్లకు అందించారు. అంతేకాదు, ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్ల వద్దకు వెళ్లి వారిని ఉత్సాహపరిచారు.
Australia
Scott Morrison
Sri Lanka
Canberra

More Telugu News