BCCI: కోచ్ గా కుంబ్లే వైదొలగడంతో అప్పుడు ‘దాదా’ ఏమీ చేయలేకపోయాడు: సీవోఏ మాజీ చీఫ్ వినోద్ రాయ్

  • ఇప్పుడైతే పోనిచ్చేవాడు కాదు
  • కోహ్లీ- కుంబ్లే మధ్య వివాదంపై వివరణ
  • నేనూ ఏమీ చేయలేకపోయా

భారత జట్టు కోచ్ గా అనిల్ కుంబ్లే ఉన్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఏర్పడ్డ విభేదాల నేపథ్యంలో కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు. దీనితో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదంలో కోహ్లీకి నచ్చజెప్పేందుకు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ప్రయత్నించారు. ఆ వివాదం గనక ఇప్పుడు చోటుచేసుకుంటే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ కుంబ్లేని పోనిచ్చేవాడు కాదని సీవోఏ (పాలన కమిటీ) మాజీ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ఈరోజు రాయ్ మీడియాతో మాట్లాడుతూ అప్పటి విషయాలను తెలిపారు.

‘మనకున్న అత్యున్నత కోచ్ అనిల్ కుంబ్లే. అతని పదవీకాలం పొడిగింపు అంశం ఒప్పందంలో ఉంటే కోచ్ గా కుంబ్లే మరికొంత కాలం ఉండేవాడు. దీనితో నేను క్రికెట్ సలహా సంఘంపై ఆధారపడ్డాను. సచిన్, సౌరవ్ లతో చర్చించా. కోహ్లీకి కుంబ్లేను కోచ్ గా కొనసాగించడం ఇష్టంలేదని వివరించా. కోహ్లీకి నచ్చజెప్పాలని సూచించా. వారిద్దరూ అప్పటికే కోహ్లీతో చర్చించామని చెప్పారు’ అని రాయ్ తెలిపారు.

కోచ్- కెప్టెన్ ల మధ్య విభేదాలుంటే ఎవరిని తీసేస్తారో మనకు తెలుసు. కచ్చితంగా కోచ్ పైనే వేటు పడుతుంది. మిథాలీ, రమేష్ పొవార్ మధ్య చోటుచేసుకున్న వివాదంలో కూడా కోచ్ పొవార్ పై వేటు పడింది' అని రాయ్ తెలిపారు. అదే వివాదం ఇప్పుడు జరిగివుంటే కుంబ్లేకు గంగూలీ మద్దతు తెలిపి కోహ్లీ నెత్తిమీద కూర్చోబెట్టేవాడని రాయ్ వ్యాఖ్యానించారు.

More Telugu News