Bithiri Sathi: నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు: బిత్తిరి సత్తి

  • సినిమాల్లో కనిపించాలన్నదే ఆశ 
  • సెట్ బాయ్ గా పనిచేశాను
  • ఎన్నో అవమానాలు జరిగాయి 
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బిత్తిరి సత్తి మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. "మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. తెరపై కనిపించాలనే ఉద్దేశంతో నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. సెట్ బాయ్ గా పనిచేశాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానైనా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో, అక్కడివాళ్లు చెప్పిన పనులన్నీ చేసేవాడిని. ఆ పనులపై తిరుగుతూ ప్రమాదాలకు గురైన సందర్భాలు లేకపోలేదు.

అవమానాలు ఎదురైనా, ఎదురు మాట్లాడితే అవకాశాలు ఇవ్వరనే భయంతో మౌనంగా ఉండిపోయేవాడిని. చిన్నవేషంలో ముందు వరుసలో కనిపించడం కూడా కష్టమయ్యేది. సమయానికి ఎవరో ఒకరు వచ్చి నన్ను వెనక్కి పంపించేవాళ్లు. కారణం ఏమిటనే విషయం కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకు ఎంతో బాధ కలిగేది. ఇలా ఈ స్థాయికి చేరుకోవడానికి నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీకావు" అని చెప్పుకొచ్చాడు.
Bithiri Sathi

More Telugu News