Huzurnagar: ఈవీఎంలపై అనుమానాలున్నాయి.. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించండి: కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ

  • హుజూర్ నగర్ లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్
  • 43,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సైదిరెడ్డి
  • ఈవీఎంలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన విపక్షాలు
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,624 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యాన్ని పొందుతూ, జయకేతనం ఎగురవేశారు. మరోవైపు, ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంలపై ఈ మూడు పార్టీల నేతలతో కలిసి స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలపై అనుమానం ఉందని, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరారు. మరోవైపు, టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
Huzurnagar
Election
Telugudesam
TRS
BJP
Congress

More Telugu News