Balakrishna: బాలకృష్ణ ముందు చిరంజీవి, గిరంజీవి ఎవ్వరూ పనికిరారు: బాబూమోహన్

  • గుర్రం నడపడంలో బాలకృష్ణ మొనగాడు
  • గుర్రాలపైకి ఎగిరి దూకుతుంటాడు
  • ఏం పట్టుకోకుండా జూలు పట్టుకుని గుర్రంపై పోతుంటాడు
ప్రముఖ సినీ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాలకృష్ణను మెచ్చుకుంటూ చిరంజీవి, గిరంజీవి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''భైరవద్వీపం' చిత్రంలో బాలకృష్ణ, నేను గుర్రాలపై వెళ్తుంటాం. గుర్రం నడపడంలో బాలకృష్ణ మొనగాడు. గుర్రాలపైకి ఎగిరి దూకుతుంటాడు. బాలకృష్ణ మాదిరి గుర్రాన్ని నడపడం చిరంజీవి, గిరంజీవి ఎవరికీ చేతకాదు. ఏం పట్టుకోకుండా జూలు పట్టుకుని గుర్రంపై పోతుంటాడు' అంటూ బాబూమోహన్ వ్యాఖ్యానించారు.
Balakrishna
Chiranjeevi
Babu Mohan
Tollywood
Horse Raid

More Telugu News