Samanta: షీ టీమ్స్ కు థ్యాంక్స్ చెప్పిన సమంత

  • షీ టీమ్స్ ఏర్పాటై ఐదేళ్లు
  • వారి కారణంగానే మహిళలకు భద్రత
  • ట్విట్టర్ లో అక్కినేని సమంత
తెలంగాణలో మహిళలు, విద్యార్థినుల రక్షణకు షీ టీమ్స్ ను ఏర్పాటు చేసి, ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్కినేని సమంత, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించింది. తెలంగాణలో ఇదో అద్భుతమని వ్యాఖ్యానించింది. షీ టీమ్స్ బృందాలకు అందరి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతూ, వారి కారణంగానే తామంతా భద్రంగా ఉన్నామని నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించింది. కాగా, పోకిరీలను నిలువరించడంలో విశేషమైన కృషి చేస్తున్న షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేయనున్నామని నిన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Samanta
Twitter
Telangana
She Teams

More Telugu News