TSRTC: జనాగ్రహం...బస్సుల్లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించిన ప్రయాణికులు

  • ప్రభుత్వం, కార్మికుల తీరుపై ఆగ్రహం
  • మలక్‌పేట, నల్గొండ క్రాస్‌రోడ్డు వద్ద ఘటన
  • గంటల తరబడి బస్సుల్లేకపోవడంతో అసహనం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న అసహనం ప్రయాణికుల్లో మొదలవుతోంది. దసరా ముందు నుంచి కొనసాగుతున్న టీఎస్సార్టీసీ సమ్మె కారణంగా బస్సుల్లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పుకుంటున్నా అవి సరిపడే స్థాయిలో లేకపోవడంతో సామాన్య జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వ, కార్మికుల తీరును వ్యతిరేకిస్తూ జనం తిరగబడుతున్నారు.

ఈరోజు పలువురు ప్రయాణికులు మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద బస్సుల కోసం వేచివున్నారు. గంటలు దాటిపోతున్నా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రయాణికులు కోపోద్రిక్తులయ్యారు. నడి రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను నిలిపి వేసి రాస్తారోకో నిర్వహించి తమ నిరసన, ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీల మొండి వైఖరి కారణంగా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు.

More Telugu News