Bithiri Sathi: కోట శ్రీనివాసరావుగారు ఎంతో ఆప్యాయంగా ఇంటికి ఆహ్వానించారు: బిత్తిరి సత్తి

  • కోట గారి ఇంటికి వెళ్లాను 
  • ఆయన మనవడికి నేనంటే ఇష్టమట
  • ఆయన ప్రశంసను మరిచిపోలేనన్న బిత్తిరి సత్తి  
బుల్లితెర ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిత్తిరి సత్తి, ఇటీవల కాలంలో వెండితెరపై కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాడు. 'తుపాకి రాముడు' సినిమాతో హీరోగా కూడా ఆయన పలకరించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " ఓ రోజున కోట శ్రీనివాసరావు గారు కాల్ చేసి తన ఇంటికి ఆహ్వానించారు. అంతటి గొప్ప నటుడు నన్ను ఇంటికి పిలవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

దాంతో ఆ మరుసటి రోజు ఆయన ఇంటికి వెళ్లాను. గుమ్మంలోనే ఆయన మనవడు ఎదురై నన్ను ఎంతో అభిమానంతో ఆహ్వానించాడు. ఆ అబ్బాయికి నేనంటే ఎంతో ఇష్టమట .. అందుకే పిలిపించానని కోట గారు అన్నారు. అలాగే నేనంటే కోట శంకర్రావు గారికి కూడా చాలా ఇష్టమని చెప్పారు. నా నటన చాలా బాగుంటుందంటూ మెచ్చుకున్నారు. ఆయన అలా అభినందించడంతో నాపై నాకు మరింత నమ్మకం పెరిగింది" అని చెప్పుకొచ్చారు.

Bithiri Sathi
Kota

More Telugu News