kerala: అత్యాచారం చేసి ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతున్నాడు: చర్చి బిషప్‌పై నన్ ఫిర్యాదు

  • ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ వేధిస్తున్నాడు
  • కొట్టాయం బిషప్‌పై నన్ ఆరోపణలు
  • జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు
ఓ చర్చి బిషప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ నన్ చేసిన ఆరోపణలు కేరళలో కలకలం రేపాయి.  కొట్టాయంకు చెందిన చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ నన్ రాష్ట్ర, జాతీయ మహిళా సంఘానికి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ సందర్భంగా రహస్యంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదును మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆమె ఆరోపణలపై విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
kerala
nun
church
kottayam
bishop

More Telugu News