Akhilapriya: అఖిలప్రియ భర్త భార్గవ్ కు బెయిల్ మంజూరు!

  • ఎన్నికల వేళ ఘర్షణ పడ్డ భార్గవ్ రామ్
  • ఇటీవల ఓ క్రషర్ వివాదంలోనూ కేసు
  • కోర్టుకు హాజరు కావడంతో బెయిల్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ మహిళా నేత అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ నాయుడుకు బెయిల్ మంజూరైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ, పోలింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఘర్షణ కేసుతో పాటు, ఇటీవల ఓ క్రషర్ వివాదమై భార్గవ్ రామ్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లోనూ ఆయనపై వారంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ కోర్టుకు భార్గవ్ రామ్ హాజరు కావడంతో, న్యాయమూర్తి రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేశారు.
Akhilapriya
Bhargav Ram
Bail
Allagadda

More Telugu News