GopiChand: కబడ్డీ టీమ్ కి కోచ్ గా యాక్షన్ హీరో గోపీచంద్!

  • సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 
  • మరో కబడ్డీ టీమ్ కి కోచ్ గా తమన్నా 
  • త్వరలో సెట్స్ పైకి   
'చాణక్య' పరాజయం తరువాత గోపీచంద్ మరింతగా ఆలోచనలో పడ్డాడు. తన తదుపరి సినిమా ఎలా ఉండాలనే విషయంలో ఆయన సన్నిహితులతో చర్చించినట్టుగా సమాచారం. తదుపరి చేయనున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చర్చలు ఎక్కువగా జరుపుతున్నాడట. సాధ్యమైనంత వరకూ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ స్క్రిప్ట్ పై కసరత్తు చేయిస్తున్నాడట.

సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఓ ప్రాంతానికి చెందిన ఫీమేల్ కబడ్డీ జట్టుకి గోపీచంద్, మరో ప్రాంతానికి చెందిన ఫీమేల్ కబడ్డీ జట్టుకి కోచ్ గా తమన్నా నటించనున్నారు. బలమైన కథాకథనాలకి తగినట్టుగానే యాక్షన్ పాళ్లు ఉంటాయట. చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.  
GopiChand
Thamannah

More Telugu News