Huzurnagar: మరో రెండు గంటల్లో ప్రారంభం కానున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక లెక్కింపు

  • 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
  • మొత్తం 22 రౌండ్లు, 14 టేబుళ్ల ఏర్పాటు 
  • మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సర్వత్ర ఉత్కంఠగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాములో ఈవీఎంలను లెక్కించనున్నారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించనుండగా, ఇందుకోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పది గంటలకు గెలుపుపై ఓ అంచనా రానుండగా, మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపునకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తి ఏర్పాట్లు చేశారు.  కాగా, హుజూర్‌నగర్ కాంగ్రెస్‌కు కంచుకోట. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడి నుంచి వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉండడంతో, ఆయన భార్య పద్మావతి ఇక్కడ బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ విజయం పట్ల ధీమాగా వుంది. అయితే, ఇక్కడ తమదే గెలుపని టీఆర్ఎస్ చెబుతోంది. మరోవైపు టీడీపీ, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

More Telugu News