Jammu: కశ్మీర్లో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి

  • ఒక జవానుకు గాయాలు
  • నిన్నటి ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదుల హతం 
  • తనిఖీలను ముమ్మరం చేసిన బలగాలు
జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి జరిపారు. ఈ దాడిలో ఒక జవాను గాయపడ్డాడు. ఈ మేరకు వివరాలను ఒక జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో సైన్యం అప్రమత్తమైంది. తనిఖీలను విస్తరించింది. నిన్న కశ్మీర్ లోని అవంతిపుర ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో కశ్మీర్ అల్ ఖైదా చీఫ్ హమీద్ లెల్హారీ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 
Jammu
Kashmir
Crpf
Kulgam
Terrorists

More Telugu News