బర్త్ డే పార్టీలో ప్రియుడితో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన మలైకా అరోరా!

23-10-2019 Wed 12:06
  • 46వ పుట్టిన రోజు జరుపుకున్న మలైకా
  • హాజరైన పలువురు బాలీవుడ్ ప్రముఖులు
  • డ్యాన్సులేసిన అర్జున్, మలైకా జంట

బాలీవుడ్ హాట్ స్టార్ మలైకా అరోరా, తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ప్రియుడు అర్జున్ కపూర్ తో కలసి వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన 46వ పుట్టిన రోజు సందర్భంగా మలైకా, సినీ ప్రముఖులకు పార్టీ ఇవ్వగా, కరణ్ జొహార్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, అనన్యా పాండే, జాన్వీ కపూర్ తదితర టాప్ స్టార్స్ వచ్చారు. ఇక అర్జున్ కపూర్ ఈ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. సిల్వర్ ఔట్ ఫిట్స్ ధరించి మెరిసిపోయిన మలైకా, అర్జున్ తో కలిసి డ్యాన్స్ చేసింది. తమ మధ్య ఉన్న వయసు తేడాను కూడా మరచిపోయి ప్రేమలో ఉన్న ఈ జంట నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.