నీ నవ్వు ఎప్పుడూ ఇలా నిష్కల్మషంగా ఉండాలి: ప్రభాస్ కు రానా మెసేజ్!

23-10-2019 Wed 11:31
  • నేడు ప్రభాస్ పుట్టిన రోజు
  • టాలీవుడ్ ప్రముఖుల శుభాకాంక్షలు 
  • ప్రభాస్ తో ఉన్న ఫోటోను షేర్ చేసిన రానా

నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కాగా, పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా 'బాహుబలి' కోసం మూడేళ్లకు పైగా ప్రభాస్ తో కలసి ప్రయాణించిన రానా, తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పాడు.

"పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా... నీ నవ్వు ఎప్పుడూ ఇలా నిష్కల్మషంగా ఉండాలి. లవ్ యూ" అని మెసేజ్ పెట్టాడు. ఈ క్యాప్షన్ కు ప్రభాస్ తో తాను ముచ్చటిస్తున్న ఓ ఫోటోను రానా జోడించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టు కనిపిస్తోంది. ఇక రానా పెట్టిన ఈ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.