వివాహమైన యువకుడిని ప్రేమించిన యువతి... పెద్దలు ఒప్పుకోనందున ఇద్దరూ ఆత్మహత్య!

23-10-2019 Wed 10:20
  • మంచిర్యాల జిల్లాలో ఘటన
  • పెళ్లికి సిద్ధపడ్డ ప్రేమజంటను వారించిన పెద్దలు
  • పురుగుల మందు తాగి ఆత్మహత్య

పెళ్లయిన ఓ యువకుడితో ఓ యువతి ప్రేమలో పడగా, పెద్దలు నిలదీశారన్న మనస్తాపంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, జిల్లా పరిధిలోని జైపూర్ మండలం రసూల్‌పల్లి సమీపంలో ఓ యువతి, యువకుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోగా, వీరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి వీరిని వెంకటేశ్, దివ్యలుగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెంకటేశ్, మందమర్రికి చెందిన దివ్యలు ప్రేమికులని తేల్చారు. కారు డ్రైవర్ గా పని చేస్తున్న వెంకటేశ్ కు గతంలోనే వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆపై దివ్యను ప్రేమించిన అతను, వివాహానికి సిద్ధపడగా, పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.

దీంతో వీరిద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేక చనిపోవాలని నిర్ణయించుకుని, పురుగుల మందు తాగారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.