Telangana: ఉద్యోగం పోతుందని మనస్తాపం.. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్

  • నిజామాబాద్-2 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గఫూర్
  • కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మనస్తాపం
  • ఆసుపత్రికి తరలిస్తుండగానే పోయిన ప్రాణాలు
ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో తెలంగాణలో ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండె ఆగింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల్‌కు చెందిన మహ్మద్‌ గఫూర్‌(34) నిజామాబాద్‌-2 డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత 20 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరోవైపు ఆర్టీసీ ప్రైవేటు పరం కానున్నదన్న వార్తలతో తీవ్ర కలత చెందాడు. తన ఉద్యోగం ఎక్కడ పోతుందోనని బెంగ పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు విడిచాడు. గఫూర్‌కు భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు.
Telangana
Kamareddy District
Nizamabad District
RTC driver

More Telugu News