బ్రహ్మోస్ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన భారత వాయుసేన

22-10-2019 Tue 20:50
  • అండమాన్ దీవుల్లో ప్రయోగం
  • కచ్చితంగా లక్ష్యాన్ని తాకిన క్షిపణులు
  • తమ సామర్థ్యం రెట్టింపు అయిందన్న వాయుసేన

భారత అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రాలుగా ఖ్యాతిపొందిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైళ్లు మరోసారి విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయి. గత కొన్నిరోజులుగా సాధారణ విన్యాసాల్లో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారత వాయుసేన బ్రహ్మోస్ ప్రయోగాలు చేపట్టింది. రెండు సర్ఫేస్ టు సర్ఫేస్ (ఉపరితలం నుంచి ఉపరితలానికి) బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించగా రెండూ 300 కిమీ దూరంలోని లక్ష్యాన్ని గురి తప్పకుండా తాకాయని వాయుసేన వర్గాలు తెలిపాయి. సంచార వేదిక నుంచి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణులతో భారత వాయుసేన భూతల దాడుల సామర్థ్యం మరింత ఇనుమడించిందని వాయుసేన పేర్కొంది.