వెండితెరకు పరిచయం అవుతున్న విలన్ కుమార్తె

22-10-2019 Tue 15:58
  • దబాంగ్-3లో సాయి మంజ్రేకర్
  • సల్మాన్ హీరోగా వస్తున్న చిత్రం
  • సాయి విలన్ పాత్రల నటుడు మహేశ్ మంజ్రేకర్ తనయ
టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు పోషించిన బాలీవుడ్ దర్శకరచయిత, నటుడు మహేశ్ మంజ్రేకర్ తన వారసురాలిని కూడా తీసుకువస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ తనయ సాయి మంజ్రేకర్ వెండితెరకు పరిచయం అవుతోంది. అది కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. సల్మాన్ ప్రస్తుతం దబాంగ్-3 చేస్తున్నారు. ఇందులో సాయి మంజ్రేకర్ ఖుషీ అనే పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో తన తండ్రి మహేశ్ మంజ్రేకర్ తో నటించిన ఓ సీన్ కూడా ఉంటుందట! తాజాగా, చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.

బాలీవుడ్ లో దబాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా చిత్రానికి మూడో సీక్వెల్ కూడా వస్తోంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్న ఈ దబాంగ్-3 చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్, డాన్ శీను, అఖిల్, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించారు.