Assam: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు: అసోం ప్రభుత్వం

  • కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం
  • 2021 జనవరి 1 నుంచి అమలు
  • జనాభా నియంత్రణే లక్ష్యం

అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల్లో ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం 2017లోనే ఆమోదం పొందింది.

అయితే, ఈ నిబంధనను 2021 నుంచి అమలు చేయాలని తాజాగా కేబినెట్ నిర్ణయించింది. జనాభా నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, బస్సు ఛార్జీలను 25 శాతం పెంచాలనే నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది.

More Telugu News