Charan raj: అయిష్టంగానే 'ప్రతిఘటన'లో విలన్ గా చేశాను: నటుడు చరణ్ రాజ్

  • కన్నడలో హీరోగా చేస్తున్న రోజులవి 
  • 'ప్రతిఘటన'లో విలన్ పాత్రకి అడిగారు 
  • నన్ను తీసుకోవద్దని ఆ ఇద్దరూ చెప్పారన్న చరణ్ రాజ్  
తెలుగులో 'ప్రతిఘటన' సినిమా ఒక చరిత్ర సృష్టించింది. అప్పటివరకూ నడుస్తున్న ట్రెండును కొత్త మలుపు తిప్పింది. ఆ సినిమాలో 'కాళీ' పాత్రను పోషించిన చరణ్ రాజ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు. "కన్నడలో నేను హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాను. వరుసగా ఏడు సినిమాలు హిట్ అయ్యాయి. ఎనిమిదవ సినిమాగా తెలుగులో 'ప్రతిఘటన' చేసే అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో విలన్ గా చేయాలని టి.కృష్ణ గారు అడిగితే, అప్పటి వరకూ హీరోగా చేసిన ఇమేజ్ పడిపోతుందేమోననే ఆందోళనతో చేయనని చెప్పాను. అయితే కన్నడలో ఒక పెద్ద నిర్మాతతో చెప్పించి నన్ను టి.కృష్ణగారు ఒప్పించారు. నిజం చెప్పాలంటే తొలిరోజున షూటింగుకి కూడా అయిష్టంగానే వెళ్లాను. నేను ఈ పాత్రకి సెట్ కాననీ .. తీసుకోవద్దని సుత్తివేలు గారు .. హరనాథరావుగారు టి.కృష్ణగారికి చెప్పారట. కానీ తొలి షాట్ ను నేను సింగిల్ టేక్ లో చేయడంతో వాళ్లు కూడా క్లాప్స్ కొట్టారు" అంటూ చెప్పుకొచ్చారు.
Charan raj
Ali

More Telugu News