ఇంకా అజ్ఞాతంలోనే కూన రవికుమార్... ఆయనింటికి వెళ్లి అల్పాహారం చేసిన చంద్రబాబు!

22-10-2019 Tue 10:57
  • పార్టీ పునర్మిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న చంద్రబాబు
  • అధికారులను తిట్టిన కేసులో కూనపై వారెంట్
  • నెల నుంచి ఇంటికి దూరంగా ఉన్న రవికుమార్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ పునర్మిర్మాణ పనుల్లో బిజీగా ఉంటూ, నేడు శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఆయన పార్టీ నేత కూన రవికుమార్ ఇంటికి అల్పాహారం నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో రవికుమార్ లేకపోవడం గమనార్హం. ఇటీవల ప్రభుత్వ అధికారులపై మాటజారిన కేసులో కూన రవికుమార్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కు ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ, కోర్టు ఇంకా మంజూరు చేయలేదు. దీంతో ఆయన దాదాపు నెల రోజులుగా ఇంటికి దూరంగా ఉండగా, పోలీసులు పరారీలో ఉన్నారని ప్రకటించి, ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.