Jakkampudi Raja: జక్కంపూడికి మరో కీలక పదవి... వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన జగన్!

  • ఇప్పటికే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి
  • గతంలో యువజన విభాగం అధ్యక్షుడిగానూ విధులు
  • జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానన్న రాజా
ఇప్పటికే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను మరో కీలక పదవి వరించింది. ఆయన్ను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించినవారి జాబితాలో తూర్పు గోదావరి జిల్లా నుంచి జక్కంపూడి ఒక్కరే ఎంపిక కావడం గమనార్హం.

గతంలో రాజా, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగానూ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా, పార్టీ అధికార ప్రతినిధిగానూ ఆయన ఎంపిక కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు మరో బాధ్యతనూ అప్పగించిన సందర్భంగా రాజా మాట్లాడుతూ, సీఎం తనపై ఉంచిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని చెప్పారు.
Jakkampudi Raja
YSRCP
Jagan
Spokes Person

More Telugu News