భువనగిరి చౌరస్తా వద్ద కారు-ఆర్టీసీ బస్సు ఢీ: 30 మందికి గాయాలు

22-10-2019 Tue 06:48
  • హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు
  • ప్రమాదానికి అతివేగమే కారణం
  • ఐదుగురి పరిస్థితి విషమం

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గత రాత్రి భువనగిరి చౌరస్తా వద్ద కారును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి.

 క్షణాల్లోనే స్పందించిన స్థానికులు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి తాత్కాలిక డ్రైవర్ అతివేగమే కారణమని తెలుస్తోంది. డ్రైవర్ కారును గమనించకుండా వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.