Bank: రేపు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు

  • 24 గంటల సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాల నిర్ణయం
  • బ్యాంకుల విలీనానికి నిరసన
  • సమ్మె ప్రభావం తమపై ఉండదన్న ఎస్ బీఐ

దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. రేపు దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మె చేపడుతున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) తెలిపాయి. ప్రధానంగా బ్యాంకు విలీనాలు, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగుల సమస్యలపైనే తాము సమ్మెకు దిగుతున్నామని ఆ రెండు సంఘాల నేతలు తెలిపారు.

అయితే ఈ సమ్మెలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) పాల్గొనడంలేదు. ఆ రెండు సంఘాల్లో దేంట్లోనూ తమ ఉద్యోగులు లేనందున సమ్మె ప్రభావం తమపై ఉండబోదని ఎస్ బీఐ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, అనేక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు కూడా సమ్మెతో సంబంధం లేదని తెలుస్తోంది.

More Telugu News