Andhra Pradesh: ఏపీలో హోంగార్డులకు బీమా సదుపాయం... యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం

  • చనిపోతే రూ.40 లక్షలు
  • అంగవైకల్యం కలిగితే రూ.30 లక్షల బీమా
  • గౌతమ్ సవాంగ్ సమక్షంలో ఒప్పందం

ఇటీవలే రాష్ట్రంలోని హోంగార్డుల వేతనం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హోంగార్డులను కూడా ఆరోగ్య భద్రతలో భాగం చేస్తూ బీమా సదుపాయం కల్పించారు. విధి నిర్వహణ సమయంలో, ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డులకు రూ.40 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.30 లక్షలు బీమా రూపంలో అందించనున్నారు. ఈ బీమా సౌకర్యం పోలీసులకు కూడా వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, యాక్సిస్ బ్యాంకు ప్రతినిధి రామకృష్ణ సమక్షంలో పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంకు మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ బీమా ద్వారా 15 వేల మంది హోంగార్డులు, 72 వేల మంది పోలీసులు ఆరోగ్య భద్రత పరిధిలోకి రానున్నారు.

More Telugu News