Shavukaru Janaki: విడాకులిచ్చిన తరువాత కూడా భర్తకి 'షావుకారు' జానకి సాయం చేసిందట

  • భర్తతో గొడవల కారణంగా విడాకులిచ్చారు 
  • ఎంతో ధైర్యంగా పిల్లలను పెంచారు 
  • విడాకులిచ్చినా ఆయన బాగోగులు చూసుకున్నారన్న ఈశ్వర్
తెలుగు తెరపై కథానాయికగాను .. కీలకమైన పాత్రల ద్వారాను 'షావుకారు' జానకి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. తాజాగా ఆమెను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. "షావుకారు జానకి గారు సినిమాల్లో పైకి వస్తున్న సమయంలోనే భర్త శ్రీనివాసరావుతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్నారు. పిల్లలు చిన్నవారే అయినా ఆమె ఎక్కడా అధైర్య పడకుండా వాళ్లను పెంచి ప్రయోజకులను చేశారు.

విడాకులైన తరువాత భర్త ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసి ఆయనకి ఇల్లు కొనిపెట్టారు. అంతేకాదు ప్రతిరోజు ఆయనకి టిఫిన్ .. మధ్యాహ్న భోజనం .. రాత్రి భోజనం పంపించేవారు. ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకసారి ఆయనకి ఒంట్లో బాగోలేకపోతే, తను సింగపూర్లో వుండి కూడా ఆయనకి మంచి వైద్యం అందేలా చూశారు. ఇక నాకు తెలిసి పనివాళ్లను ఆమె అంత మంచిగా చూసుకునే వాళ్లను నేను చూడలేదు" అని చెప్పుకొచ్చారు.
Shavukaru Janaki

More Telugu News