Kinjarapu Acchamnaidu: మా హయాంలో కేసులు పెడితే ఒక్క వైసీపీ నేత మిగిలేవారు కాదు: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

  • టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడరు
  • కార్యకర్తల  రక్షణకు  మా ప్రాణాలు ఫణంగా పెడతాము
  • వైసీపీ వంటి శాడిస్ట్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు
మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడితే ఒక్క వైసీపీ నేత కూడా బయట ఉండేవారు కాదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడరని పేర్కొన్నారు. అవినీతి చేసి జైలుపాలయిన జగన్ వంటి నేతలు సిగ్గుపడాలన్నారు. అక్రమ కేసులకు బదులు ఇస్తామన్నారు. తమ పార్టీ ఓటమిని ఎవరూ కూడా ఊహించలేకపోయారన్నారు.

దేశంలో వైసీపీ వంటి శాడిస్ట్ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలను వేధించడం ఆపాలి. కార్యకర్తలకు అండగా ఉంటాము.. వారి రక్షణకు మా ప్రాణాలు ఫణంగా పెడతాము. అవసరమైతే జోలె పట్టి వారిని ఆదుకుంటాము’ అని అన్నారు.
Kinjarapu Acchamnaidu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News