Jagan: జగన్ కిల్లర్ రాజకీయాలు మా ముందు పనిచేయవు: చంద్రబాబు

  • ఒక నాయకుడు పోతే వంద మంది నేతలు పుడతారు
  • జగన్ డౌన్ డౌన్ అంటే అరెస్టు చేస్తారా ?
  • పులివెందుల రాజకీయాలు చేస్తే ఖబడ్దార్
జగన్ కిల్లర్ రాజకీయాలు టీడీపీ ముందు పనిచేయవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తమ పార్టీ ఉంటుందన్నారు. జగన్ డౌన్ డౌన్ అంటే అరెస్టు చేసి కేసులు పెడతారా ? అని బాబు ప్రశ్నించారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్షంలో కొనసాగుతూ తనను నడిరోడ్డుపై ఉరితీయాలన్న వ్యాఖ్యలు పోలీసులకు వినపడలేదా అని ప్రశ్నించారు. పులివెందుల రాజకీయాలు చేస్తే ఖబడ్దార్... తీవ్రవాదుల దాడులు తనను ఏమీ చేయలేకపోయాయని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.

శ్రీకాకుళంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు. ఒక నాయకుడు పోతే వంద మంది నేతలు పుడతారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు టీడీపీకి అవినాభావ సంబంధం ఉందన్నారు.
Jagan
Chandrababu
Telugudesam
Pulivendula
Andhra Pradesh

More Telugu News