Revanth Reddy: పోలీసులను తప్పించుకుని ప్రగతి భవన్ కు బైక్ పై రేవంత్ రెడ్డి

  • జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి కదిలిన కాంగ్రెస్ ఎంపీ
  • ఉదయం నుంచి పోలీసులకు చిక్కని రేవంత్ రెడ్డి
  •  ప్రగతి భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు
బైక్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ జేఏసీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అయితే, పోలీసులకు రేవంత్ రెడ్డి మాత్రం దొరకలేదు.

రేవంత్ రెడ్డి కోసం ఓ వైపు గాలింపు జరుగుతుండగా మరోవైపు వారి నుంచి తప్పించుకుని ఆయన బైక్ పై రయ్ మంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి బయలుదేరారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఆయన కదిలారు. అయితే, ఆయనను మార్గ మధ్యంలో పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రగతి భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
Revanth Reddy
Congress
KCR

More Telugu News